పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరిహర వీర మల్లులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన "మాట వినాలి" అనే ఫస్ట్ సింగిల్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ పాటకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ప్రముఖ నటుడు బాబీ డియోల్ హరిహర వీరమల్లు సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు.
హరిహర వీరమల్లు సినిమాలో నటించే ఛాన్స్ "యానిమల్" సినిమా రిలీజ్ కి ముందు వచ్చిందని ఈ కథ విన్నప్పుడు తనని ఎంతగానో నచ్చిందని అందుకే వెంటనే ఒకే చెప్పానని తెలిపాడు. ఈ సినిమా స్టోరీ దేశంలోని ప్రతీ ఒక్కరికి భావోద్వేగాలకు కనెక్ట్ అవుతుందని ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశాలు నటులకి రావడం అరుదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
దీంతో హరిహర వీర మల్లు సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి. అయితే ఈ సినిమా అప్పట్లో భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల పాలనలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మార్చి 28, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమాలో క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా ఎ. దయాకర్ రావు మరియు ఎఎమ్ రత్నం సమర్పిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.