MamithaBaiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్.. దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్!

MamithaBaiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్.. దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్!

ప్రస్తుతం మమిత బైజు (Mamitha Baiju)సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ప్రేమలు రిలీజ్ తరువాత ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అంతేకాదు చాలా మంది కుర్రాళ్ళకి లేటెస్ట్ క్రష్ లిస్టులోకి కూడా చేరిపోయింది. ప్రేమలు సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ 'తలపతి 69' మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోవిజయ్ (Thalapathy 69) మూవీకి మంచి క్రేజ్ ఉంది. త్వరలో విజయ్ రాజకీయాల్లో బిజీగా మారుతుండటం.. ఇక తాను నటించబోయే లాస్ట్ సినిమా ఇదే అవ్వడం.. ఇలా ఆడియన్స్ తో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ సామజిక కథ, కథనాలతో రూపొందుతుంది. ఈ నేపథ్యంలో తలపతి 69 మూవీని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ వరుస అప్డేట్స్ ఇస్తోంది.

ఇందులో భాగంగా అక్టోబర్ 1న తలపతి 69 మూవీలో నటించబోయే నటీనటులు ఎవరనేది రివీల్ చేశారు మేకర్స్. మొదటగా బాలీవుడ్ నటుడు, యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్‌ (Bobby Deol)‌‌‌ ను అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రంలోని ఇతర నటీనటులను కూడా త్వరలోనే రివీల్ చేస్తామని మేకర్స్ చెప్పారు.    

అయితే, నెటిజన్లు మాత్రం  ఇందులో నటించబోయే వారి పేర్లను డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. ఇలా 'దళపతి 69' లో పూజా హెగ్డే, ప్రియమణి, ప్రకాష్ రాజ్ మరియు ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే మమితా బైజు కెరీర్ లో మంచి స్టాండింగ్ ఫిల్మ్ దొరికినట్టే అని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే యంగ్ కేరళ బ్యూటీ మమితా బైజు.. రీసెంట్ గా కోలీవుడ్ లో రెబల్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్ కు జోడీగా నటించింది. దీంతో పాటు విష్ణు విశాల్- రామ్ కుమార్ కాంబోలో తెరకెక్కనున్న మూవీలో లీడ్ రోల్ పోషించనుంది. తెలుగులో ప్రేమలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి..టాలీవుడ్ లోను వరుస ఆఫర్లు అందుకుంటుంది.

అయితే, ఇప్పటికే కేరళ నుంచి సాయి పల్లవి, అనుపమ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. దీంతో మమితా బైజు ఆచూతూచి మంచి కథలను ఎంచుకోవాలని సినీ వర్గాలు చెబుతున్నాయి.  

విజయ్ 69వ చిత్రానికి గతంలో వలిమై, ఖాకీ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి తమిళ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. కెవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు.