TSAT: టీసాట్​లో ఇక వ్యవసాయ ప్రసారాలు

TSAT: టీసాట్​లో ఇక వ్యవసాయ  ప్రసారాలు
  • సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: విద్య, ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షల కంటెంట్​ను అందిస్తున్న టీసాట్ నెట్​వర్క్​.. ఇకపై వ్యవసాయ ప్రసారాలనూ అందిస్తుందని సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి చెప్పారు. నిపుణ చానల్ లో ప్రతి సోమవారం, శనివారం సాయంత్రం 4  గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారాలుంటాయని, ఆ మరునాడు విద్య చానెల్​లో ఉదయం 7 నుంచి 8 గంటలకు పున:ప్రసారం అవుతాయని ఆదివారం తెలిపారు. 

మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రసారమయ్యే హార్టికల్చర్​ అంశాలూ.. ఉదయం 7 నుంచి 8 వరకు పున:ప్రసారమవుతాయని వివరించారు. సందేహాలుంటే టీ-సాట్​లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరయ్యే నిపుణులకు ఫోన్​ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ వర్సిటీ, తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవన శాఖల శాస్త్రవేత్తలు, అధికారులు, అనుభవం కలిగిన రైతులు ఈ కార్యక్రమంలో తమ సలహాలు ఇస్తారన్నారు. నిపుణుల సలహాల కోసం 040–-23540326/726 టోల్ ఫ్రీ నెం.1800 425 4039కు కాల్​ చేయొచ్చని ఆయన సూచించారు.