ఎమ్మెల్యే షకీల్ ​నియంతలా వ్యవహరిస్తుండు

  • అందుకే బీఆర్ఎస్​కు రాజీనామా
  • బోధన్​ జేఏసీ నాయకులు, ఉద్యమకారులు

బోధన్, వెలుగు: బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ఆమేర్​నియంతలా వ్యవహరిస్తున్నారని, అందుకే బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు బోధన్​ జేఏసీ నాయకులు, ఉద్యమకారులు గోపాల్​రెడ్డి, శివరాజ్, నరేందర్, శ్యామ్, సాయిలు పేర్కొన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుందని, ఎవరైనా గొంతెత్తితే అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం లాంటి ఉద్యమ నాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. గద్దర్​ను కనీసం ప్రగతి భవన్​లోకి కూడా రానీయకపోవడం శోచనీయమన్నారు. ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామని వెల్లడించారు. తెలంగాణ మొత్తం ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితి మారాలని.. మేధావులు గొంతెత్తాలని కోరారు.