మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదు : ఎమ్మెల్యే షకీల్

ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పట్ల సంతృప్తిగా లేనని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. నియోజకవర్గంలో తాను చేయాలనుకున్న పనులు చేయలేకపోయానని చెప్పారు. నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయని.. ప్రభుత్వ సాయంతో అన్ని పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తానన్నారు. తనకు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ‘మన ఊరు మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు ఉంటుందా.. లేదా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని షకీల్ తెలిపారు. ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఎంఐఎంకు ఉందన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని గ్రామం లేదు.. కేసీఆర్ పథకాలు లేని ఇల్లు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందన్నారు.