పల్లెల అభివృద్ధే సర్కార్ లక్ష్యం : బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

పల్లెల అభివృద్ధే సర్కార్ లక్ష్యం : బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి
  • ఎడపల్లి, రెంజల్ మండలాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఎడపల్లి/రెంజల్(నవీపేట్)/బోధన్​, వెలుగు : పల్లెల అభివృద్ధే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జానకంపేట్​ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.40 లక్షల తో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.  అనంతరం జాకంపేట్​ గ్రామంలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు.  రెంజల్ మండలం దుపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.12లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాం ఎమ్మెల్యే ప్రారంభించారు.

పెగడపల్లిలో ప్రీమియం లీగ్​ సీజన్​-2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు.  ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి, గడుగు గంగాదర్​, అంతిరెడ్డి రాజిరెడ్డి, నగేశ్​,   జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగభూష్ణం రెడ్డి,  పీసీసీ డెలిగేట్ గంగాశంకర్​,  పులి శ్రీనివాస్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.