- బోధన్ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
బోధన్, వెలుగు : గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు స్టూడెంట్స్‌కు నాణ్యమైన విద్యనందించి, తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందాలని బోధన్ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. బోధన్‌లోని ఆయేషా గార్డెన్లో శుక్రవారం పీఆర్టీయూ యూనియన్ టీచర్ల డైరీని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గవర్నమెంట్ స్కూళ్లలో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని
ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లపై నమ్మకం లేకే పేరేంట్స్ ప్రైవేట్బడులను ఆశ్రయిస్తున్నారన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 269 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్చెక్కులు అందజేశారు. బోధన్, ఎడపల్లి ఎమ్మార్వోలు గంగాధర్, మోతీసింగ్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఎడపల్లి : గ్రామాల్లో విచ్చలవిడిగా నడుస్తోన్న మద్యం బెల్ట్‌షాప్‌లను, గంజాయి దందాను అరికట్టాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఎక్సైజ్, పోలీస్అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని జానకంపేట్, టానా కలాన్, కుర్నాపల్లి, మంగల్‌పాడ్, అంబం, బ్రాహ్మణ్‌పల్లి, జైతాపూర్తదితర గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ముందుగా జానకంపేట్లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సుదర్శన్‌రెడ్డి తర్వాత టానాకలాన్లో ప్రైమరీ స్కూల్‌ను తనిఖీ చేశారు.
స్కూల్హెడ్మాస్టర్ లాటరీ పేరుతో స్టూడెంట్స్నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్కంప్లైంట్ చేయగా హెచ్‌ఎమ్‌పై సీరియస్అయ్యారు. అనంతరం టానాకలాన్, కుర్నాపల్లి, వయా మంగల్‌పాడ్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. కుర్నాపల్లి హైస్కూల్‌ను సందర్శించి స్టూడెంట్స్‌తో మాట్లాడారు. ఎడపల్లిలో ఎక్సైజ్, పోలీస్అధికారులతో మీటింగ్ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మండలా ధ్యక్షుడు పులి శ్రీనివాస్, లీడర్లు తాహెర్‌బిన్ హందాన్, బిల్లా రాంమోహన్, ఈరంటి లింగం పాల్గొన్నారు.