తహసీల్దార్​ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీలు

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం బోధన్​ సబ్​కలెక్టర్ వికాస్ మహతో​ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలురికార్డులను ఆయన పరిశీలించారు. ఎడపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్​ 500 నుంచి 800 వరకు ఉన్న భూములను గతంలో రెవెన్యూ అధికారులు ఎన్ఎస్ఎఫ్ కు చెందిన భూములుగా రికార్డు చేశారు.

దీంతో ఎన్ఎస్ఎఫ్ భూములు కానటువంటి భూముల క్రయవిక్రయాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వియాన్ని కొంతమంది రైతులు సబ్​కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సబ్​కలెక్టర్​వెంట ఎన్ఎస్​ఎఫ్​ కోర్​కమిటీ సభ్యులు విశ్వనాథం, తహసీల్దార్​ దన్వాల్ తదితరులు ఉన్నారు.