తమిళనాడులోని తిరువాణ్నామలైలో విషాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు చనిపోయారు. నిన్న ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో అందులో ఉన్నవారు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. బాధిత ఫ్యామిలీలకు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు ఎంకే స్టాలిన్.