మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పట్టణంలో బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం ప్రారంభమైన వార్షికోత్సవాలు ఆదివారంతోముగిశాయి. ముందుగా హోమం, ప్రత్యేక పూజలు బొడ్రాయి వద్ద నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాజకీయ నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల వేణుమాధవ్, ఘనపురపు అంజయ్య, మాలె నాగేశ్వర్ రావు, బొడ్డుపెళ్లి ఉపేంద్రం, ఎడ్ల రమేశ్, ఆకుల హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.