మేడిపల్లి, వెలుగు : ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ చెప్పారు. స్థానిక 23వ డివిజన్లో కార్పొరేటర్ రాసాల వెంకటేశ్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 సీసీ టీవీ కెమెరాలను ఎమ్మెల్యే మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఇన్స్పెక్టర్గోవింద్ రెడ్డితో కలిసి మేయర్అజయ్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్పరిధిలో ప్రతిఒక్కరూ మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. కౌన్సిల్ మీటింగ్ చర్చించి మెయిన్సెంటర్లలో సీసీ కెమెరాలు పెడతామన్నారు. డిప్యూటీ మేయర్ కొత్త కిశోర్ స్రవంతి, కార్పొరేటర్లు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.