మేడిపల్లి, వెలుగు: మేయర్ తోటకూర అజయ్ యాదవ్అధ్యక్షతన గురువారం బోడుప్పల్మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ.43.37 కోట్లతో పలు డివిజన్లలో డ్రైనేజీ, బీటీ, సీసీ రోడ్లు నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం మేయర్ అజయ్మాట్లాడుతూ.. 5 నెలల కాలంలో రూ.100 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు, కరెంట్ సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారం మరువలేనిదన్నారు. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, కమిషనర్ జి.రామలింగం, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిశోర్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.