రూ.50 లక్షలతో డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్​ నిర్మాణం

  • శంకుస్థాపన చేసిన తోటకూర వజ్రేశ్​యాదవ్

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్​కార్పొరేషన్​ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ చెప్పారు. బుధవారం ఆయన 28వ డివిజన్​కార్పొరేటర్​చీరాల నర్సింహ, మేయర్​అజయ్​యాదవ్ తో కలిసి రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఎస్సీ బస్తీలో కమ్యూనిటీ హాలు, శ్రీసాయి ఎన్​క్లేవ్​డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మేయర్ అజయ్​యాదవ్ మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిశోర్ గౌడ్, సీనియర్​నాయకులు పోగుల నర్సింహారెడ్డి, కొత్త కిశోర్ గౌడ్, దానగల్ల యాదగిరి కాలనీవాసులు పాల్గొన్నారు.