అవయవ దానంతో పునర్జన్మ ఎత్తాడు

బ్రెయిన్​డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. కరీంనగర్ జిల్లా ఆర్నాకొండ గ్రామానికి చెందిన ఆవుల రవి కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబసభ్యులు.. మరే ఇంట ఈ విషాదం జరగకూడదనుకుని అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు.

అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. కరీంనగర్ జిల్లా ఆర్నాకొండ గ్రామానికి చెందిన ఆవుల రవి (46) ఆటో నడుపుతూ జీవనం గడిపేవారు. అతడికి హైబీపీ కావడంతో  కళ్లు తిరిగి కిందపడ్డాడు.  దీంతో కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.  తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.  రవి శరీరం చికిత్సకు సహకరించలేదు.  మెదడులో తీవ్రంగా రక్తస్థాయి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇంత కష్ట సమయంలో కూడా కుటుంబ సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం నలుగురికి వ్యక్తులకు అవయవాలు కేటాయించారు. రవి భౌతికకాయానికి సోమజిగూడా యశోద ఆసుపత్రి  సిబ్బంది, జీవన్ దాన్ సభ్యులు,కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి వీడ్కోలు పలికారు..మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.