
హైదరాబాద్, వెలుగు: బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ (బిల్డ్) పోటీ నాలుగో ఎడిషన్ విజేతలను ప్రకటించారు. థ్రస్ట్ వర్క్స్ డైనెటిక్స్, నెక్సస్ పవర్, ఎక్స్ ట్రీవ్ ఇన్నోవేషన్స్, క్వాలివన్ టెక్నాలజీ, రాఫా బయోనిక్స్, హైప్రిక్స్ ఏవియేషన్, త్రిశూల్ స్పేస్ జట్లు విజేతలుగా నిలిచాయి. స్టూడెంట్లు, ప్రారంభ దశలోని స్టార్టప్‌లు వారి వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, వాటిని వాస్తవిక వ్యాపార ప్రతిపాదనలుగా అభివృద్ధి చేయడానికి ఈ పోటీ ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరం పోటీలో పాల్గొన్నవాళ్లు ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్నాలజీ, సోషల్ ఇన్‌పాక్ట్, సస్టెయినబిలిటీ రంగాలపై దృష్టి సారించారు. బిల్డ్ ప్రోగ్రామ్ ఎంపికైన జట్లకు పరిశ్రమ నిపుణులు, వ్యాపారవేత్తల నుండి మెంటార్షిప్, శిక్షణ, మద్దతు, రూ.10 లక్షల ఆర్థికసాయం లభిస్తుందని బోయింగ్ తెలిపింది.