రన్నింగ్ ఫ్లైట్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జనవరి 18 రాత్రి మియామి ఇంటర్నేషనల్ ఎయిరో పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 ఫ్లైట్ ఫ్యూరోరికాకు బయల్దేరింది.
ఫ్టైట్ టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ ఫ్లైట్ ను వెనక్కి మళ్లించి మియామి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు.
An Atlas Air Boeing cargo plane was forced to make an emergency landing at Miami International Airport after experiencing an engine malfunction shortly after departure, today.
— Massimo (@Rainmaker1973) January 19, 2024
The crew followed all standard procedures and safely returned to MIA.pic.twitter.com/5BLPAMNhn9