ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఐటీ, టెలికాం, నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయన్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఏవియేషన్ రంగంలో దిగ్గజ సంస్థ బోయింగ్ కూడా లేఆఫ్స్ బాట పట్టింది... అయితే, పర్మనెంట్ లేఆఫ్స్ కాదు, టెంపరరీ లేఆఫ్స్. టెంపరరీ లేఆఫ్స్ కింద పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు సంస్థ సీఈఓ వెస్ట్ తెలిపారు.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ అఫ్ మెషనిస్ట్స్ కి సంబంధించిన 33వేల మంది ఉద్యోగులు స్ట్రైక్ లో పాల్గొనటమే బోయింగ్ సంస్థ టెంపరరీ లేఆఫ్స్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. స్ట్రైక్ లో ఉన్న ఉద్యోగులకు 25శాతం హైక్ ఆఫర్ చేసినా ఒప్పుకోలేదని, 40శాతం డిమాండ్ చేసినట్లు వెస్ట్ తెలిపారు.
Also Read:-కెన్యాలో ఐటీ సంక్షోభం
ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా తమ సంస్థలోని అన్ని లెవెల్స్ కి సంబంధిచిన ఉద్యోగులకు హైక్, ప్రమోషన్స్ ను నిలిపివేసినట్లు తెలిపారు. అంతే కాకుండా కొత్త నియామకాలను కూడా నిలిపేశామని తెలిపారు వెస్ట్.