ప్రస్తుతం కొన్ని సంస్థలు ఆర్థికంగా నష్టాలు చూస్తుండడంతో కంపెనీకి భారమైన ఉద్యోగులను వదిలించుకునేందుకు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు సంస్థలు నిర్వహణా వ్యయాన్ని తగ్గించేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే ఇటీవలే ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ దాదాపుగా 17000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేస్తోంది.
ఈ విషయంపై బోయింగ్ సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బర్గ్ఉద్యోగులతో మాట్లాడారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి గణనీయమైన తగ్గింపు అవసరమని దీంతో రాబోయే నెలల్లో, ఉద్యోగుల పరిమాణాన్ని సుమారు 10 శాతం తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గ్జిక్యూటివ్‌లు, మేనేజర్‌లు తదితరులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించాడు.
Also Read :- ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. వర్షంలోనూ బోగీల తరలింపు
ఈ విషయం ఇలా ఉండగా 33,000 మంది యూఎస్ వెస్ట్ కోస్ట్ కార్మికులు ఉద్యోగ ప్రయోజనాల కోసం సమ్మె నిర్వహిస్తునారు. ఈ కారణంగా 737 MAX, 767 మరియు 777 జెట్‌ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో బోయింగ్ సంస్థ దాదాపుగా $5 బిలియన్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో ఈ నష్టాల్ని సరిచేందుకు ఈ ఉద్యోగుల తొలగింపుకి సిద్దమైనట్లు తెలుస్తోంది.