కలెక్టర్‌పై దాడి వెనక పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు?

కలెక్టర్‌పై దాడి వెనక పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు?

ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ  ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బోగమోని సురేష్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లిన తీసుకెళ్లిన బోగమోని సురేష్‌.. గ్రామస్థులను ఉసిగొల్పి దాడికి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు.

దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్లు

ఆరోపణలు ఎదుర్కొంటున్న బోగమోని సురేష్‌ దాడి జరగడానికి ముందు నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు కనుగొన్నారు. అదే సమయంలో నరేందర్ రెడ్డి.. సురేష్‌తో మాట్లాడుతూనే కేటీఆర్‌కు ఫోన్లు చేసినట్లు తేల్చారు. బోగమోని సురేష్‌‌పై రేప్ సహా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Also Read:-వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక అసలు ఏం జరిగిందంటే?

విచారణకు ఆదేశం

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లగచర్లలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.