ఉధృతంగా బొగత జలపాతం..స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌కు అనుమతి లేదన్న ఆఫీసర్లు

ఉధృతంగా బొగత జలపాతం..స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌కు అనుమతి లేదన్న ఆఫీసర్లు

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో వర్షాలు పడుతుండడంతో జలపాతం ఎగువన ఉన్న అడవితో పాటు నల్లన్‌‌‌‌‌‌‌‌దేవి వాగు, పాలమడుగు, నేరేడు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో బొగత జలపాతంలోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. 

సెల్ఫీ వ్యూ పాయింట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న సేఫ్టీ బారికేడ్లు,స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌ పూల వద్ద నుంచి నీరు ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు ఆంక్షలు విధించారు. జలపాతం వద్ద నీటిలోకి ఎవరూ దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌వో చంద్రమౌళి సూచించారు.

పాలెం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి సమీపంలోని పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేశామని ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్ కార్తీక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి నీటి విడుదలకు అవకాశం ఉందని లక్ష్మీపురం, పాత్రాపురం, టేకులబోరు, వెంగల్‌‌‌‌‌‌‌‌రావుపేట, తుర్సావానిగూడెం, గొల్లగూడెం గ్రామాల ప్రజలు అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని సూచించారు.