
- కార్మికుల నిరవధిక సమ్మె షురూ
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచాలని బెల్లంపల్లి రీజియన్ ఏఐటీయూసీ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్ డిమాండ్‌చేశారు. వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారించాలని మందమర్రి ఏరియాకు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేస్తూ బుధవారం నిరవధిక సమ్మెకు దిగారు. వీరికి ఏఐటీయూసీ మద్దతు తెలిపింది.
ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. కార్మిక చట్టాలు అమలు కాకపోవడంతో వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లకు కనీస వేతనం రూ.32వేలు, క్లీనర్‌కు రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెలా 10న జీతాలు చెల్లించాలన్నారు. సమ్మెలో సింగరేణి కాలరీస్ కోల్ ట్రాన్స్పోర్ట్వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ మిట్టపెల్లి పౌల్, కుమార్, శ్రీశైలం, రవి తదితరులు పాల్గొన్నారు.