వైరా, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బోయినపల్లి కృష్ణమూర్తి ఆ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వారం రోజుల కింద హైదరాబాద్పార్టీ ఆఫీస్‌లో చేరారు.
ఆదివారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయడంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.