సికింద్రాబాద్ లో దారుణ ఘటన జరిగింది. బోయిన పల్లి స్టేషన్ పరిధిలో సమీర్ అనే వ్యక్తి.. ఇంటి ముందు కూర్చొని స్నేహితులతో మాట్లాడుకొనుచున్నాడు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు ఆ ప్రదేశానికి వచ్చి సమీర్ ను కత్తులతో పొడిచి చంపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... సమీర్ ... ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సమీర్ భార్య బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు.
హత్యా సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ పరిశీలించి ప్రత్యక్ష సాక్షులను విచారించారు. సమీర్ ను హత్య చేసిన వారు .. మేమే చంపేశామంటూ నినాదాలు చేస్తూ అక్కడ నుంచి వెళ్లారని స్థానికులు తెలిపారని పోలీసులు తెలియజేశారు. సమీర్... గతంలో తాను పని చేసే సంస్థ యజమాని కుమార్తె ఫిర్దోజ్ ను ప్రేమించి .. పెళ్లి చేసుకోవడంతో పరువు హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.