రైతులకు కరెంట్ కష్టాలు తప్పినయ్ : బోయినపల్లి వినోద్ కుమార్

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  వినోద్

 కోనరావుపేట,వెలుగు : 24 గంటల ఉచిత కరెంట్ తో రైతులకు కరెంట్​ కష్టాలు తప్పాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని సుద్దాల, పల్లిమక్త, కనగర్తి, ధర్మారం, మర్తనపేటరాజన్న గొల్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు, జడ్పీ చైర్ పర్సన్ అరుణతో కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో  దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.నాడు అలజడులతో ఉన్న పల్లెలు నేడు జలసవ్వడులతో సుభిక్షంగా ఉన్నాయన్నారు. అలాంటి ప్రభుత్వం మళ్లీ రావాలంటే, కేసీఆర్ మూడోసారి సీఎం  కావాలని, చల్మెడ ను గెలిపించాలన్నారు.  

బావుసాయి పేట, కొలనూర్ కు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకుడు వీరవేని తిరుపతి ఆధ్వర్యంలో సుమారు 150 మంది పార్టీలో  చేరగా వారికి చల్మెడ లక్ష్మీనరసింహారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో  పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్  నర్సయ్య, పాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు  దేవయ్య,  సంధ్య,  రజిని,  ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.