కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించే యోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో వినోద్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇందులో భాగంగా వినోద్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో గ్రామ ప్రజలు కోతుల బెడద ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కోతుల బెడద గురించి ఆలోచిస్తుందని వినోద్ కుమార్ తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానన్నారు.
కోతికి గాయమైతే తొందరగా మానదని.. కోతులకు ఏ పద్ధతిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయాలో.. లేక మందులతో కోతులకు కుటుంబ నియంత్రణ చేయవచ్చా అనే కోణంలో అనుభవిజ్ఞులైన వైద్యులతో సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
మామూలుగా అయితే కొత్తగా పెళైన అమ్మాయిలు అప్పుడే పిల్లలు వద్దనుకుంటే.. టాబ్లెట్ వేసుకుంటారు కదా.. అట్లా చేద్దామా లేక ఇంకేవిధంగా చేస్తే కోతుల బెడద తగ్గుతుందనే విషయాన్ని రీసెర్చ్ చేస్తున్నామని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు.