వచ్చే టర్మ్‌‌లో గర్శకుర్తిని మండలం చేస్తాం : బి.వినోద్​కుమార్

గంగాధర, వెలుగు : సాంకేతిక కారణాలతో గర్శకుర్తి మండల ఏర్పాటు ఆలస్యమైందని, వచ్చే సర్కార్‌‌‌‌లో మండల కేంద్రంగా మారుస్తామని ప్లానింగ్​బోర్డ్​వైస్​ చైర్మన్​ బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. గంగాధర మండలం గర్శకుర్తిలో సోమవారం ఆయన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఆర్డర్​ను జనవరి నుంచే తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌‌కు ఓటేస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని, ఓటర్లు ఆలోచించి స్థానికుడైన రవిశంకర్‌‌‌‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్​ ముందుచూపుతో జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు.

అనంతరం గర్శకుర్తి మాజీ ఎంపీటీసీ చిప్ప లావణ్య- చక్రపాణి కాంగ్రెస్‌‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్​లో చేరారు. జయపాల్​రెడ్డి, ఎంపీపీ శ్రీరామ్​ మధుకర్​, మండలాధ్యక్షుడు నవీన్​రావు, సర్పంచ్​ నాగలక్ష్మి, ఎంపీటీసీ రజిత పాల్గొన్నారు.