నేత కార్మికుల పెండింగ్‌‌‌‌‌‌‌‌ బకాయిలు విడుదల చేయాలి : బోయినపల్లి వినోద్ కుమార్

సిరిసిల్ల టౌన్,  వెలుగు :  నేత కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన పల్లి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. శుక్రవారం సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రూ. 3400  కోట్ల ఆర్డర్లతో నేత కార్మికులకు చేయూత అందించిందన్నారు.   

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు తెలంగాణ నేత కార్మికులకు ఇవ్వకుండా కమీషన్ల కోసం సూరత్‌‌‌‌‌‌‌‌, బీవండీ, షోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు.  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని ఈ నెల14  వరకు నేత కార్మికులకు బకాయిలు విడుదల చేసి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  లేదంటే  ఈ నెల 15న కార్మికులతో కలసి మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య, టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి, బీఆర్ఎస్ లీడర్లు  తుల ఉమ, గూడూరి ప్రవీణ్‌‌‌‌‌‌‌‌,  చీటీ నర్సింగ రావు, బొల్లి రామ్మోహన్‌‌‌‌‌‌‌‌, సికిందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనోజ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.