అక్కడ నేను లేను : హత్రాస్ ఘటనపై బోలే బాబా స్పందన

అక్కడ నేను లేను : హత్రాస్ ఘటనపై బోలే బాబా స్పందన

హత్రాస్ ఘటనపై బోలే బాబా స్పందించాడు. జూన్ 2న బోలే బాబా సత్సంగ్ కార్యక్రమాల్లో జరిగిన తొక్కికసలాటలో 121 మంది మరణించారు. అయితే ఈ విషాద ఘటనపై బోలేబాబా స్పందించాడు. హత్రాస్ తొక్కిసలాటకు సంఘవిద్రోహశక్తులే కారణమని భోలే బాబా ఆరోపించారు. గందరగోళం జరగడానికి ముందే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ తాను లేనని బాబా అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి బాబా తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. 

బోలే బాబాగా పిలవబడే గాడ్ మాన్ నారాయణ్ సకర్ హరి పై కొంతమంది న్యాయవాదులు కేసులు పెట్టారు.  ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలావుండగా భద్రత కోసం ఏర్పాటు చేసిన జారేవాలు కారణంగా భక్తులు నెట్టివేశారని తర్వాత తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలోని ప్రాథమిక విచారణలో తేలింది.