
బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (మార్చి2) తెల్లవారు జామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది చనిపో యారు. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి భయానకంగా ఉన్నాయి.
బొలివియాలో పర్వత ఫొటోసీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇది మూడో రోడ్డు ప్రమాదం. జనవరిలో ఫొటోసీ , ఒరురో మధ్య 800 మీటల లోయలో బస్సు పడిపోయి 30మందికి పైగా మృతిచెందారు. మరో ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయారు.
స్పాట్ కు చేరుకున్న ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద పండుగ అయిన ఒరురో కార్నివాల్ కు ఒరురోకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.