బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో చేసిన వివాదాస్పద ట్వీట్ నేపథ్యంలో మలాడ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొరీవలి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
బాలీవుడ్ లో అగ్ర హీరోలు, హీరోయిన్లు, నటీనటులతో పాటు భారీ సినిమాలను విమర్శిస్తూ ట్వీట్స్ చేయడం కమల్ రషీద్ ఖాన్ అలవాటు. రెండేళ్ల క్రితం.. 2020లో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అరెస్ట్‌కు కారణమైంది. మహారాష్ట్రలోని ముంబై ఎయిర్ పోర్ట్‌లో దిగిన కమల్ రషీద్ ఖాన్ ను మలద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోరివలీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కమల్ రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయి గతంలో కేసులు వేశారు.
Kamal R Khan arrested at Mumbai airport today
— ANI Digital (@ani_digital) August 30, 2022
Read @ANI Story | https://t.co/ZjJT4opWW1#krk #KamalRKhan #BreakingNews #MumbaiAirport pic.twitter.com/viDxQJFzgQ
సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడటం లేదని, వసూళ్లు రావడం లేదని ట్వీట్స్ చేశాడు. తన పరువుకు భంగం వాటిల్లే , ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ట్వీట్స్ ఉంటున్నాయని సల్మాన్ తరపు లాయర్ కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత సల్మాన్ గురించి ఎటువంటి ట్వీట్స్ చేయవద్దని కోర్టు ఆదేశించింది.
'రాధే : మోస్ట్ వాంటెడ్ భాయ్' మూవీ విడుదల అయినప్పుడు కూడా కమల్ రషీద్ ఖాన్ ట్వీట్స్ చేశాడు. సినిమా బాలేదని రివ్యూ ఇవ్వడమే కాకుండా... కలెక్షన్స్ పోస్ట్ చేస్తూ ఫ్లాప్ అని విమర్శలు చేశాడు. గత ఏడాది కమల్ రషీద్ ఖాన్ మీద మనోజ్ బాజ్‌పాయి క్రిమినల్ కేసు వేశారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ను 'సాఫ్ట్ పోర్న్' సిరీస్‌గా పేర్కొన్నాడు. అంతేకాదు.. మనోజ్ భార్య, కుమార్తె గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పరువు నష్టం ద్వావా వేశారు.
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వార్తల్లో ఉండటమే ముఖ్యం అన్నట్లు కమల్ రషీద్ ఖాన్ ట్వీట్స్ చేస్తుంటాడు. 'త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైనప్పుడు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఇప్పుడు కమల్ రషీద్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ చూస్తే... విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల 'లైగర్' సినిమా గురించి ఎక్కువ ట్వీట్స్ కనిపిస్తాయి. సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే... యూనిట్ సభ్యుల మనసు గాయపరిచేలా చేశాడు. గతంలోనూ ఇలానే చాలా సినిమాలపై ట్వీట్స్ చేశాడు.