అఫీషియల్ అప్డేట్: ప్రభాస్ ఫౌజీలో బాలీవుడ్ స్టార్.. ఎవరంటే..?

అఫీషియల్ అప్డేట్: ప్రభాస్ ఫౌజీలో బాలీవుడ్ స్టార్.. ఎవరంటే..?

యంగ్ రెబల్ సార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తోపాటూ మార్కెట్ కూడా ఉంది. కానీ ఈ మధ్య ప్రభాస్ తన సినిమా రిలీజ్ విషయంలో లేట్ అవుతుండటంతో ఫ్యాన్స్ నిరాశకి గురవుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం తెలుగులో "ఫౌజీ" అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.  అయితే తెలుగులో కార్తికేయ 2, ది కాశ్మీర్ ఫైల్స్, తదితర సినిమాలలో నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఫౌజీ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా తన కేరీర్ లో 54వ సినిమాలో ప్రభాస్ తో కలసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడని బాహుబలి, ఇండియన్ సినిమా ప్రైడ్ తో కలసి నటిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి తదితరులతో కలసి దిగిన ఫోటోలని కూడా షేర్ చేశాడు. 

ALSO READ | Mohan Babu: నటుడు మోహన్ బాబు కి ముందస్తు బెయిల్ మంజూరు.. ఎందుకంటే.?

ఈ విషయం ఇలా ఉండగా దర్శకుడు హనూ రాఘవపూడి సీతారామం సినిమాతో మంచి క్లాసికల్ హిట్ అందుకున్నాడు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ని పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా చూపించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది చివరిలో రిలీజ్ ఉండబోతున్నట్లు సమాచారం.