యంగ్ హీరో అశ్విన్ బాబు(Ashwin Babu) ప్రధాన పాత్రలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ganga Entertainments) ప్రొడక్షన్ పై మహేశ్వర్ రెడ్డి మూలి(Maheshwar reddy Mooli) ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అప్సర్(Apsar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కీ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు అర్బాజ్ ఖాన్. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అర్బాజ్.
ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నారు ఆయన. ఈ సందర్బంగా గంగా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయడం ఆనందంగా ఫీలయ్యారు. ఈ సినిమా డిఫరెంట్ కథతో వస్తోందని, ఖచ్చితంగా విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థలో మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పాత్ర అద్భుతంగా అంటుంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం.. అని అన్నారు. ఇక ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుండగా.. హైపర్ ఆది, సాయి ధీన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.