నేను ప్రభాస్ ని ఆ ఉద్దేశంతో అనలేదు:బాలీవుడ్ నటుడు

నేను ప్రభాస్ ని ఆ ఉద్దేశంతో అనలేదు:బాలీవుడ్ నటుడు

ఆమధ్య బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ టాలీవుడ్ ప్రముఖ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై జోకర్ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలువురు సినీ సెలెబ్రెటీలు కూడా స్పందించి అర్షద్ కి చురకలు అంటించారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా అర్షద్ వార్సీపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో దెబ్బకి అర్షద్ వార్సీ గతంలో తాను ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి సంజాయిషీ ఇచ్చాడు.

ఇందులోభాగంగా ప్రభాస్ చాలా అద్భుతమైన నటుడని అలాగే అతడంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాంటి అద్భుతమైన నటుడికి సరైన పాత్ర ఇవ్వనప్పుడు అది ప్రేక్షకులకు హృదయవిదారకంగా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర తనకి ఏమాత్రం నచ్చలేదని దీంతో తాను జోకర్ అని కామెంట్స్ చేశానని అంతేతప్ప వ్యక్తిగతంగా ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చాడు. 

Also Read :- దేవర కలెక్షన్లు.. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

ఈ విషయం ఇలా ఉండగా 2003 లో ప్రముఖ స్టార్ హీరో సంజయ్ దత్ హీరోగా నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం ద్వారా అర్షద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో, టెలివిజన్ సీరియల్స్ లో నటించాడు. కానీ ప్రభాస్ పై కామెంట్లు చేసినప్పటినుంచి అర్షద్ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది.