హాస్పిటల్ నుంచి నటుడు గోవింద డిశ్చార్జ్..

హాస్పిటల్ నుంచి నటుడు గోవింద డిశ్చార్జ్..

బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద  అక్టోబరు 1న ముంబైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ అయిన కారణంగా బుల్లెట్‌ గాయాలతో  ముంబైలోని ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి మోకాలి నుంచి 9 ఎంఎం బుల్లెట్‌ను తొలగించారు. అనంతరం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసి 3 రోజులపాటు అబ్జర్వేషన్ ఉంచారు.  

అయితే నటుడు గోవింద ఆరోగ్యం కుదుటపడటంతో ఈరోజు (అక్టోబర్ 4) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా మరియు అభిమానులతో మాట్లాడారు. తనపై ఇంతగా ప్రేమాభిమానాలు చూపించినవారికి మరియు తాను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ముంబై పోలీసులకి మరియు త్వరగతిన స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ అందించి తనని ప్రమాదం నుంచి తప్పించిన డాక్టర్లకి థాంక్స్ తెలుపుతో ఎమోషనల్ అయ్యారు.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు గోవింద ఇంట్లో తుపాకీ ఎలా పేలిందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా గోవింద ని విచారించగా అక్టోబర్ 1న ఉదయం 4:30 గంటల సమయంలో కోల్‌కతాకు బయలుదేరే ముందు తన లైసెన్స్ తుపాకీని తనిఖీ చేస్తున్నప్పుడు చేజారి ఈ సంఘటన జరిగినట్లు గోవింద పోలీసుల విచారణలో తెలిపారు.