బాలీవుడ్ ప్రముఖ నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో శనివారం ఉదయం ఆయనను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక మిథున్ చక్రవర్తి విషయానికి వస్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 73 ఏళ్ల మిథున్ దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తు.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 1982లో రిలీజైన డిస్కో డ్యాన్సర్ మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మిథున్.. హిందీ, తమిళ్, కన్నడ, పంజాబీ, బెంగాలీ, ఒడిశా, భోజ్‌పురి భాషల్లో 350 కి పైగా సినిమాల్లో నటించారు. 2015లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోపాల గోపాల చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
ALSO READ :- హనుమాన్ హీరోతో ఈగల్ డైరెక్టర్.. సరికొత్తగా సూపర్ అప్డేట్ ఇచ్చేశాడు
కేవలం సినిమాలనే కాకుండా.. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు మిథున్. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2014లో రాజ్యసభకు వెళ్లారు. రెండేళ్ల తరువాత ఆ పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఇటీవలే మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.