చిలుకూరు బాలాజీని దర్శించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా

చిలుకూరు బాలాజీని దర్శించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో సందడి చేశారు.  తెలంగాణ తిరుపతి గా పేరు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్నిసందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు ప్రియాంక చోప్రా.  మంగళవారము ( జనవరి 21, 2025 ) ఆలయాన్ని సందర్శించిన ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ వీసాల దేవుడిగా భక్తులకు కొంగుబంగారంగా నిలిచి.. తెలంగాణ తిరుపతి గా పేరు అందిన చిలుకూరు బాలాజీ అందరికీ ఆశీర్వాదం ఇస్తారని అన్నారు.

ALSO READ | Kiran Abbavaram: తండ్రి కాబోతున్న హీరో కిరణ్‌ అబ్బవరం.. గుడ్ న్యూస్ చెబుతూ ఫొటో షేర్‌

భక్తులు దేవుని నమ్మినప్పుడే దేవుడు భక్తులకు కోరుకున్న కోరికలు తీరుస్తారని అన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి భక్తులు ఎంతోమంది స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేయడం ఆదర్శమన్నారు. ప్రియాంక చోప్రా స్వామి వారిని దర్శించుకోవడం ఆమెకు బాలాజీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సన్మానించడం జరిగిందని అన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం హాలీవుడ్ కి పరిమితమైన ప్రియాంక చోప్రా.. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళిల కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.