ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత..సైఫ్‌‌‌‌అలీఖాన్ డిశ్చార్జ్

ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత..సైఫ్‌‌‌‌అలీఖాన్ డిశ్చార్జ్
  • ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి చేరుకున్న యాక్టర్ 
  • వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ సూచించిన డాక్టర్లు  

ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన.. ఆరు రోజుల ట్రీట్మెంట్ అనంతరం ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. 

డిశ్చార్జ్ సందర్భంగా సైఫ్​కు డాక్టర్లు పలు సూచనలు చేశారు. ఒక వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు కొన్ని రోజులదాకా బయటివ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత సైఫ్‌‌‌‌ ఇంటికి బయలుదేరారు. 

అయన వెంట తల్లి, నటి షర్మిలా ఠాగూర్ ఉన్నారు. సైఫ్​ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఆసుపత్రితోపాటు బాంద్రాలోని ఇంటి వద్దకు చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.