బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు సైఫ్ పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ ఒంటిపై ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
దుండగుల దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. రెండు చోట్ల లోతుగా గాయాలు.. వెన్నెముక పక్కన గాయం అయినట్లు డాక్టర్లు గుర్తించారు. సైఫ్ కు డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు. సర్జరీ తర్వాతే ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని డాక్టర్లు అన్నారు.
గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించారు. పని మనిషితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. సైఫ్ కలుగజేసుకొనే వరకు నేరుగా సైఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి దాడి చేసింది ఎవరనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై 3వ జోన్ డీసీపీ దీక్షిత్ గెదమ్ తెలిపారు.
#WATCH | Mumbai | Actor Saif Ali Khan is receiving treatment in Lilavati Hospital And Research Centre after he sustained minor injuries following a scuffle with an intruder who entered his residence late last night
— ANI (@ANI) January 16, 2025
Visuals from outside the hospital pic.twitter.com/VQIVKQaf7h