ఇటీవలే తెలుగులో ప్రముఖ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రంలో సం 80 పాత్రలో నటించి మెప్పించింది బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే. అయితే నటి కల్కి చిత్ర షూటింగ్ సమయంలో దీపికా పదుకునే గర్భం దాల్చింది. అయినప్పటికీ షూటింగ్ కి విరామం ఇవ్వకుండా పూర్తే చేసింది. అంతేకాదు ఆ మధ్య కల్కి చిత్ర ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది.
అయితే ప్రసవం నిమిత్తమై ముంబై నగరంలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలో దీపికా పదుకునే సెప్టెంబర్ 8వ తారీఖున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం తర్వాత పలు టెస్టులు, బేబీ మరియు తల్లి కండీషన్ కారణంగా దాదాపుగా వారం రోజులపాటు హాస్పిటల్ లోనే అడ్మిట్ అయ్యింది.
Also Read :- హీరోయిన్ పెళ్ళికి హాజరైన ముఖ్యమంత్రి.
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఈరోజు(సెప్టెంబర్ 15,2024) నటి దీపికా పదుకునే తన కూతురితో కలసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. దీంతో దీపికా కుటుంబ సభ్యులు ఆమెకి ఘాన స్వాగతం పలికారు. అయితే దీపికా పదుకునే తన కూతురి ముఖాన్ని మాత్రం చూపించలేదు.