Hina Khan: బాలీవుడ్ ప్రముఖ నటి "హీనా ఖాన్" క్యాన్సర్ భారిన పడినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం తనకి బ్రెస్ట్ క్యాన్సర్ 3వ స్టేజిలో ఉందని దీంతో తాను ముంబై లో ఉన్నటువంటి ఓ ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ లో కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ట్రీట్మెంట్ సమయంలో తీసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలెబ్రెటీలు అంకిత లోఖండే, సినీ గ్రోవర్, ఆర్తి సింగ్, దల్జీత్ కౌర్ తదితరులు క్యాన్సర్ బారినుంచి హీనా ఖాన్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ మహమ్మారి జయించే క్రమంలో మేము మీకు తోడుగా ఉంటామని కాబట్టి ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటి క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : Bigg Boss: ఈ ఫైనల్ వీక్ (Dec 7) ఓటింగ్ తారుమారు.. మారిపోయిన స్థానాలు.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు?
అయితే హీనా కెరీర్ విషయానికొస్తే పలు ప్రయివేట్ సాంగ్స్ అలాగే బిగ్ బాస్ హిందీ 14వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గిని అలరించింది. ఆ తర్వాత 6కి పైగా సినిమాల్లో హీరోయిన్ గ నటించింది. ఇందులో "హ్యక్డ్' అనే సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే నాగిన్, ఇండియన్ ఐడల్, యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్, షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించింది.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకూ బాలీవుడ్ లో సోనాలి బింద్రే, మహిమ చౌదరి, మనీష కొయిరాలా, సంజయ్ దత్, లీసా రే, రాకేష్ రోషన్, అనురాగ్ బసు, తాహీరా కశ్యప్ తదితరులు క్యాన్సర్ భారిన పడ్డారు. ఇందులో కొందరు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ని జయించి బాగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు.