
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ సౌత్‌పైనే పెడుతోంది. గతేడాది ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. ఇందులో విలేజ్ గర్ల్ క్యారెక్టర్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తోంది. బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న ఈ చిత్రంలోనూ జాన్వీ పాత్ర డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పారు మేకర్స్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో జాన్వీ క్యారెక్టర్ ఎంతో కీలకంగా ఉండనుందని చెప్పడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలోనూ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అలాగే పా రంజిత్ రూపొందిస్తున్న తమిళ వెబ్ సిరీస్‌కు కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న జాన్వీ కపూర్ సౌత్‌లో పాగా వేసేందుకు సిద్ధమవుతోందని అనిపిస్తుంది.