అమెరికాలోని కార్చిచ్చు ఘటనపై స్పందించిన హీరోయిన్.. మేం బ్రతికిపోయాం అంటూ..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన కార్చిచ్చు ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా  సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులోభాగంగా ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. లాస్ ఏంజిల్స్లో నా ఫ్రెండ్స్, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్ర యులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. ఇలాంటి విషాదం సమయంలో మేము సురక్షితం గా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాలి త్వరలో నే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. 

ఇక ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తు న్న అగ్నిమాపక సిబ్బందితోపాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సుర క్షితంగా ఉండండి అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. కాగా.. సటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఏంజిల్లో తన భర్త జీన్ గూడెనఘ్ కలిసి అక్కడే నివసిస్తున్నారు. 

ALSO READ | 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..

ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రీతి జింటా తెలుగులో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. aఅ తర్వాత బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు రావడంతో మళ్లీ తెలుగులో నటించలేదు. ప్రస్తుతం  ప్రీతి జింటా హిందీలో సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పా త్ర లో నటిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ నెలలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.