ఛావా సినిమాను.. కుంభమేళాలో చావులతో పోల్చుతూ నటి సంచలన కామెంట్స్..

ఛావా సినిమాను.. కుంభమేళాలో చావులతో పోల్చుతూ నటి సంచలన కామెంట్స్..

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఎప్పుడూ ఎదో ఒక కాంట్రావర్శిలో నిలుస్తుంటుంది. ఐతే ఇటీవలే బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఛావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ పాత్రలో నటించగా ఆయన భార్య యేసుభాయిబాబు పాత్రలో నేషనల్ క్రష్ రశ్మిక మందాన నటించింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈక్రమంలో సినిమా చూసిన కొందరు ఏకంగా ఎమోషనల్ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయంపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 

ఇందులో భాగంగా "కుంభమేళాలో తొక్కిసలాటలు జరిగి మనుషులు చనిపోయిన  తర్వాత జేసీబీ బుల్డోజర్‌తో శవాలను తొలగించారని ఇలాంటి భయంకరమైన మరణం కంటే, సినిమాల్లో కల్పితమైన చిత్ర హింసల సీన్స్ కి జనాలు రియాక్ట్ అవుతున్నారని  బ్రెయిన్ డెడ్ సమాజం" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి హిస్టారికల్ బేస్డ్ సినిమాలు చరిత్రని భావితరాలకు అందజేస్తాయని అలాగే సినిమా చుసిన ఆడియన్స్ ఎలా స్పందించాలనేది పూర్తిగ వారి ఇష్టమని...  ఎత్తి చూపాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆడియన్స్ ఎక్కువగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కంటే రీల్ లైఫ్ లో చూపించే ఇన్సిడెంట్స్ ని ఇష్టపడుతారని అందుకే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని అంటున్నారు.

ALSO READ : Chhaava movie collections: పెరుగుతున్న ఛావా మూవీ కలెక్షన్స్.. హిస్టరీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా...?

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం స్వరా భాస్కర్ "శ్రీమతి ఫలాని" అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి హిందీ ప్రముఖ డైరెక్టర్ మనీష్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి..