సినిమా ఇండస్ట్రీలో ప్లాన్ B లేకపోతే కష్టమంటున్న తెలుగు హీరోయిన్..

సినిమా ఇండస్ట్రీలో ప్లాన్ B లేకపోతే కష్టమంటున్న తెలుగు హీరోయిన్..

పలు టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. ఇప్పుడంటే బాలీవుడ్ లో బిజీగా ఉండి తెలుగు సినిమాల్లో నటించడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం రవితేజ, వెంకటేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఒక ఊపు ఊపింది. అయితే బాలీవుడ్ లో పింక్ సినిమాలో నటించిన తర్వాత కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో దూసుకుపోతోంది.

అయితే ఇటీవలే నటి తాప్సీ ఓ ఇంటర్వూ లో ఇండస్ట్రీలోని అనుభవం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా సినిమా అనేది రంగుల ప్రపంచమని ఇందులో హార్డ్ వర్క్ ని మాత్రమే నమ్ముకుంటే వర్కౌట్ అవ్వదని లక్ కూడా ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలోని పరిస్థితులని ఎప్పటికిప్పడు అంచనా వేస్తుండాలని లేకపోతే అనవసరంగా సమయం వృథా అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తాను ఇంజనీరింగ్ చదివానని, ఉద్యోగం కూడా ఉందని తెలిపింది. 

Also Read :- తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ వాయిదా

ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో క్లిక్ కాకపోయింటే కచ్చితంగా తన చదువుకుతగ్గ ఉద్యోగంలో సెటిల్ అయ్యేదానినని తెలిపింది. అలాగే కేవలం సినిమాల్లో నటించిమాత్రమే లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలోనైనా లేదా జీవితంలో అయినా కచ్చితంగా ప్లాన్ బి ఉండాలని లేకపోతే ఇప్పుడున్న జెనెరేషన్ లో రాణించడం కష్టమని నూతన నటీనటులకు సూచించింది.

ఇక తన వైవాహిక జీవితం గురించి స్పందిస్తూ తాను తన భర్త బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బో పెళ్లి తర్వాత చాలా హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నామని తెలిపింది. అయితే మథియాస్ బో తనకి 9 ఏళ్ళ ముందు ప్రపోజ్ చేశాడని ఆ తరవాత ఒకరినొకరు క్షుణ్ణంగా తెలుసుకుని అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నామని అందుకే తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు, విభేదాలు లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.