విడాకుల కోసం కోర్టుకెళ్లిన మరో స్టార్ నటి...

విడాకుల కోసం కోర్టుకెళ్లిన మరో స్టార్ నటి...

బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్మిళ మటోండ్కర్ తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతూ కోర్టులో విడాకులకు పిటీషన్ దాఖలు చేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

పూర్తీ వివరాల్లోకి వెళితే నటి ఊర్మిళ బాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన మోడల్ మరియు వ్యాపారవేత్త మొహ్సిన్ అక్తర్ మీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ఇరువురి పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 4, 2016న ముంబైలోని ఊర్మిళ నివాసంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. అయితే ఊర్మిళ కంటే  మొహ్సిన్ అక్తర్ దాదాపుగా 10 సంవత్సరాలు చిన్నవాడైనప్పటికీ వీరిద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవడంతో వివాహం చేసుకున్నారు. 

ALSO READ | బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్

కాగా పెళ్లయిన 8 ఏళ్ళ తర్వాత ఊర్మిళ తన భర్తతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయంశంగా మారింది. అయితే ఈ నెల 24వ తారీఖున నటి ఊర్మిళ ముంబై కోర్టులో తనకి విడాకులు మంజూరు చెయ్యాలని పిటీషన్ దాఖలు చేసింది.

ఈ విషయం  ఇలా ఉండగా నటి ఊర్మిళ తెలుగులో అంతం, గాయం, అనగనగ ఒకరోజు తదితర చిత్రాల్లో నటించింది. ఇక బాలీవుడ్ లో దాదాపుగా 30కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించి పలు అవార్డులు రివార్డులు అందుకుంది.