ఫ్యాషన్ స్టయిలిస్ట్ తో ఊర్వశి రౌటేలా పెళ్లి.. దానికోసమే వెయిటింగ్ అంటూ కామెంట్..

ఫ్యాషన్ స్టయిలిస్ట్ తో ఊర్వశి రౌటేలా పెళ్లి..  దానికోసమే వెయిటింగ్ అంటూ కామెంట్..

బాలీవుడ్ ప్రముఖ మోడల్, నటి ఊర్వశి రౌటేలా ఇటీవలే తెలుగులో వచ్చిన "డాకు మహారాజ్" సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ ని స్టోరీలో షేర్ చెయ్యడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ మరోసారి ట్రోల్ చేశారు. అయితే పెళ్లిపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచింది ఊర్వశి.

ఇంతకీ ఏం జరిగిందంటే బాలీవుడ్ కి చెందిన ఓర్హాన్ అవత్రమణి(ఫ్యాషన్ స్టయిలిస్ట్) ఇటీవలే జరిగిన ఆదర్ జైన్ మరియు అలేఖ అద్వానీల వివాహానికి హాజరయ్యాడు. ఇందులో భాగంగా రెడ్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అలాగే ఈ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలకి ఆదర్ జైన్ మరియు అలేఖ అద్వానీల వివాహానికి హాజరయ్యానని చెబుతూ నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశాడు. దీంతో ఉర్వశి రౌటేలా ఏకంగా నీ పెళ్లి కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేసింది. దీంతో ఓర్రీ వెంటనే “మన వివాహం” అంటూ రిప్లయ్ ఇచ్చాడు. 

దీంతో  ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఏకంగా త్వరలో ఊర్వశి, ఓర్రీ వివాహం చేసుకోబోతున్నారని ప్రచారాలు చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఓర్రీ నార్మల్ గానే అందరి సెలెబ్రెటీల కామెంట్లకి ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటాడని ఇందులభాగంగానే ఊర్వశి కామెంట్ కి కూడా రిప్లై ఇచ్చాడని అంతమాత్రాన వారిద్దరికి పెళ్లి జరగబోతోందని ప్రచారాలు చెయ్యడం సరికాదని అంటున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య నటి ఊర్వశి స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు ఫుల్ లెంగ్త్ రోల్స్ పాత్రలు చెయ్యడానికి కూడా ఒకే చెబుతోంది. అయితే ఊర్వశి సినిమా బ్యాడ్జెట్ ని బట్టి ఒక్కోపాటకి రూ.2 నుంచి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం..