బాలయ్య లెజెండరీ యాక్టర్ అంటున్న స్టార్ హీరోయిన్

బాలయ్య లెజెండరీ యాక్టర్ అంటున్న స్టార్ హీరోయిన్

తెలుగులో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్.బి.కే 109 చిత్రంలో హీరోగా నషస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కే.ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళీ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కామియో అప్పియరెన్స్ పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ్ మోడల్ మరియు మోడల్ ఊర్వశి రౌటేలా  స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. 

ఇటీవలే నటి  ఊర్వశి రౌటేలా  బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా బాలకృష్ణ లెజెండరీ యాక్టర్ అని, పనిపట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారని తెలిపింది. తనకి బాలకృష్ణ అంటే  అభిమానమని అలాగే బాలకృష్ణ కూడా ఇతరులను ఎంతో గౌరవిస్తాడని చెప్పుకొచ్చింది. 

ALSO READ | మ్యూజిక్ డైరెక్టర్ కొడుకుని కాలేజ్‌లో చెవి కొరికి ర్యాగింగ్

కాగా తాను ప్రస్తుతం ఎన్.బి.కే 109 చిత్రం కోసం బాలకృష్ణ తో కలసి పని చేస్తున్నానని ఈ క్రమంలో సెట్స్ లో తానెప్పుడూ అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. అయితే ఒక వ్యక్తి పై ఒక్కొక్కరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయనని ఈ క్రమంలో తమపట్ల ప్రవర్తించిన తీరు, గతంలో జరిగిన సంఘటనలు వంటివాటినిబట్టి బాలకృష్ణ పై తనకున్న అభిప్రాయం గురించి వెల్లడించానని తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి ఊర్వశి రౌటేలా ఈ మధ్య ఒకపక్క సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించాడనికి ఒకే చెబుతోంది. ఈ బ్యూటీ ఆ మధ్య తెలుగులో మెగాస్టార్ చిరంజీవీ హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రకారుని కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ బ్యూటీకి ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.