
ఈమధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో సినీ సెలెబ్రటీలకి చిక్కులు ఎదురవుతున్నాయి.. ఇందులో ముఖ్యంగా స్పీడ్ ఇన్ఫర్మేషన్ కోసం సృష్టించిన ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ని కొందరు తప్పుదోవలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫోటోలను మార్ఫింగ్ చెయ్యడం, అసభ్యకర వీడియోలు క్రియేట్ చెయ్యడం వంటివి చేస్తూ సినీ సెలబ్రటీల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఈ విషయంపై బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ సినిమాతో బాగా పాపులర్ అయిన నటి విద్యాబాలన్ ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది. ఇదే అదునుగా చేసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యాబాలన్ ఫొటోలతో డీప్ ఫేక్ ని ఉపయోగించి మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
దీంతో విద్యాబాలన్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులోభాగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు తనవి కావని క్లారిటీ ఇచ్చింది. అంతేగాకుండా ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా ఏఐ ఉపయోగించి క్రియేట్ చేసినవని తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.