
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ కో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో మరో క్రీజ్ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.
పుష్ప 2 తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం దాదాపుగా రూ.15 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నప్పటికీ సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ మరో తెలుగు డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. దీంతో అట్లీ కుమార్ సినిమా షూటింగ్ విషయంపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC16(వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి తెలుగు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా మైత్రిహీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ జోనర్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో RC16 రిలీజ్ ఉండబోతున్నట్లు సమాచారం.