జాన్వీ హైదరాబాద్​లోనే మకాం..ఎందుకో తెలుసా?

బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor)​ ఎన్టీఆర్(NTR) ​తో దేవర(Devara) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే..జాన్వీ ముందు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. అయితే, ఇక్కడ షూటింగ్​చేసి తిరిగి ముంబై వెళ్లి రావడం, హోటళ్లలో ఉండాల్సి రావడం వల్ల ఈ నటి ఇబ్బంది పడుతుందట. అందుకే హైదరాబాద్లోనే  సెటిలయ్యేలా రూ.3 కోట్లు పెట్టి ఖరీదైన ఏరియాలో ఓ ఫ్లాట్ని కొనుగోలు చేసిందట. దీన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్లో పాగా వేసేందుకు జాన్వీ పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది.

జాన్వీ క‌పూర్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్కు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకోనుంది. ఒక్కో సినిమాకి 4 నుంచి5 కోట్ల రెమ్యునరేషన్  అందుకుంటోంది. ఇక రీసెంట్గా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్కు గాను అంత‌కుమించిన రెమ్యునరేషన్ను డిమాండ్ చేసింద‌ని టాక్ వినిపిస్తోంది.  

జాన్వీ తన రెమ్యునరేషన్ విషయంలో చాలా తెలివిగా ఆలోచించి..ఈ మొత్తాన్నిపెట్టుబడులుగా మారుస్తోందంట. ముఖ్యంగా అపార్ట్మెంట్ల కొనుగోళ్ల‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని స‌మాచారం. జాన్వీ కపూర్ 2020 లోనే జుహులో రూ.39 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్‌ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  

2018లో ధడక్ మూవీతో బాలీవుడ్‌లోకి  ఎంట్రీ ఇచ్చింది. రూహి, మిలి, బ‌వాల్ వంటి మూవీస్ తో సక్సెస్ అందుకొంది. ప్రస్తుతం జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ దేవర మూవీతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అప్డేట్స్​రిలీజ్​ చేసి ఫ్యాన్స్కు సప్రైజ్​ఇవ్వనుందట. జాన్వీ నటించిన మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి అక్టోబర్ 7న రిలీజ్ కానుంది.